పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘం నిధులు, దసరా ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ డివిజన్ల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించగా.. తెరాస కార్పొరేటర్లు వారిపై విరుచుకుపడటం వల్ల సమావేశం రసాభాసాగా మారింది.
కాంట్రాక్టర్లు లబ్ధి పొందడానికే దసరా పండుగ పేరిట 50 లక్షల రూపాయలు కేటాయించారని కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. మహిళా కార్పొరేటర్ సుజాత మాట్లాడుతుండగా.. అవమానపరిచారని తెరాస నేతలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ అనిల్ కుమార్ మహిళా కార్పొరేటర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్ స్పందించకపోవడం వల్ల కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించారు.
- ఇదీ చదవండి హైదరాబాద్‌లో మూడుసార్లు కంపించిన భూమి