ETV Bharat / state

విశ్రాంత ఆర్మీ జవాన్​ అరెస్టు.. కాల్పుల్లో 14 బుల్లెట్లు వినియోగం

గాల్లోకి కాల్పులు జరిపిన విశ్రాంత ఆర్మీ జవాన్​ను పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 1న స్థానికుల కోరిక మేరకు బద్దం తిరుమల్​ రెడ్డి కాల్పులు జరిపినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్​ తెలిపారు. ఈ కాల్పుల్లో తిరుమల్​ రెడ్డి 14 బుల్లెట్లు వినియోగించినట్లు పేర్కొన్నారు.

author img

By

Published : Feb 14, 2020, 6:06 PM IST

విశ్రాంత ఆర్మీ జవాన్​ అరెస్టు.. కాల్పుల్లో 14 బుల్లెట్లు వినియోగం
విశ్రాంత ఆర్మీ జవాన్​ అరెస్టు.. కాల్పుల్లో 14 బుల్లెట్లు వినియోగం

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో ఇటీవల గాల్లోకి కాల్పులు జరిపిన విశ్రాంత ఆర్మీ జవాన్​ బద్దం తిరుమల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బద్దం తిరుమల్ రెడ్డి ఆర్మీలో పని చేసి 2019లో పదవీ విరమణ పొందినట్లు డీసీపీ రవీందర్​ వెల్లడించారు. అనంతరం జమ్మూ కశ్మీర్లో అనుమతి ద్వారా తుపాకి కొనుగోలు చేసి తన ఇంట్లో భద్రపరిచినట్లు తెలిపారు. జనవరి 1న స్థానికుల కోరిక మేరకు బద్దం తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపారన్నారు.

రవీందర్​ బంధువులే..

ఈ దృశ్యాలను తిరుమల్ రెడ్డి బంధువులే చరవాణిలో చిత్రీకరించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్లు రవీందర్​ పేర్కొన్నారు. అయితే అవి పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. తిరుమల్ రెడ్డిని అరెస్టు చేసి తుపాకీతో పాటు 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బద్దం తిరుమల్ రెడ్డి రెండు సార్లు కాల్పులు జరిపి 14 బుల్లెట్లు వినియోగించినట్లు రవీందర్​ తెలిపారు. జమ్మూకశ్మీర్లో అనుమతి ద్వారా తుపాకీ పొందిన బద్దం తిరుమల్ రెడ్డి ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ రెండు విషయాలపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రవీందర్​ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: తల్లీకుమార్తె దారుణ హత్య.. అతని పనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.