ETV Bharat / state

కరోనా హెల్మెట్​తో వాహనాదారులకు అవగాహన

కరోనా వైరస్ నివారణకు గోదావరిఖనిలో పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు. రామగుండం ట్రాఫిక్ పోలీసులు... కరోనా ఆకృతిలో ఉన్న హెల్మెట్​ ధరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.

ramagundam traffic police campaigning with corona helmets in godavarikhani
కరోనా హెల్మెట్​తో వాహనాదారులకు అవగాహన
author img

By

Published : Apr 1, 2020, 7:01 PM IST

కరోనా వైరస్ నివారణపై రామగుండం ట్రాఫిక్ పోలీసులు గోదావరిఖనిలో వినూత్నరీతిలో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్​ ఆకారంలో హెల్మెట్​లు ధరించి కూడళ్లలో నిలబడి... తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా నివారణకు పాటు పడాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్​ నివారణకు తోడ్పాటు అందించిన వారమవుతామని సూచిస్తున్నారు.

ఏప్రిల్​ 14 వరకు ప్రభుత్వం లాక్​డౌన్​ ప్రకటించినందున ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లలోనే ఉండాలన్నారు. వాహనాదారులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ రామ్​రెడ్డి, గోదావరిఖని సీఐ రమేష్ , ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

కరోనా హెల్మెట్​తో వాహనాదారులకు అవగాహన

ఇవీ చూడండి: డ్రైవింగ్​ లైసెన్స్​ గడువు ముగిసిందా.. ఏం పర్లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.