ETV Bharat / state

ట్రాఫిక్​ సిబ్బందికి ఫేస్​ షీల్డులు పంపిణీ చేసిన ట్రాఫిక్​ సీఐ - traffic police

కరోనా నేపథ్యంలో ట్రాఫిక్​ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం ట్రాఫిక్​ సీఐ సూచించారు. పెద్దపల్లి జిల్లా ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బందికి ట్రాఫిక్​ సీఐ రమేష్​ బాబు ఫేస్​ షీల్డులను పంపిణీ చేశారు.

ramagundam traffic ci face shields distribution to traffic police in peddapalli district
ట్రాఫిక్​ సిబ్బందికి ఫేస్​ షీల్డులు పంపిణీ చేసిన ట్రాఫిక్​ సీఐ
author img

By

Published : Jul 21, 2020, 9:41 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రామగుండం ట్రాఫిక్ పోలీసులకు రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు తన చేతుల మీదుగా ఫేస్​షీల్డులను అందజేశారు.పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు ఫేస్​ షీల్డులను పంపిణీ చేశారు. రామగుండం సీపీ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది సంక్షేమం కొరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా సిబ్బందికి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారని సీఐ రమేష్ ​బాబు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బంది ప్రతి రోజు రోడ్ల మీద ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తారని... కావున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

విధులు నిర్వహిస్తున్న సమయంలో, సొంత పనుల మీద బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. బయటకు వెళ్లే సమయంలో శానిటైజర్ కచ్చితంగా వెంబడి ఉంచుకోవాలన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రైతులంతా ఒకే తాటిపైకి రావాలి: మంత్రి జగదీశ్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.