పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్ పరిధిలో రెండవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించే దిశగా రెండవ పట్టణ ప్రగతి కార్యాచరణ రూపొందించారని ఆయన తెలిపారు. రామగుండం కార్పొరేషన్లోని 30వ డివిజన్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రధాన కాలువ క్లీనింగ్ పనులను పరిశీలించారు.
కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో పారిశుద్ధ్య సమస్యలు ఉన్నట్టు త్వరలోనే వాటిని పరిష్కరించనున్నట్టు తెలిపారు. రామగుండం పట్టణంలోని ప్రధాన కాలువ క్లీనింగ్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్టు ఆయన స్పష్టం చేశారు. రానున్న వర్షాకాలం సీజనల్ వ్యాధులు పాటించకుండా ప్రజలంతా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
వాధ్యులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రతి ఇంట్లో, వీధిలో నీరునిల్వకుండా చూసుకోవాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మురికి కాల్వల క్లీనింగ్, అండర్ డ్రైనేజిలు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నాయకులు నారాయణదాసు, మారుతి, ఇరుగురాళ్ల శ్రావణ్, బూరుగు వంశీకృష్ణ, అబ్బాస్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దొంగకు కరోనా ఉంటే.. వణికిపోతున్న పోలీసులు.!