ETV Bharat / state

ఎరువుల కర్మాగారం యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఉద్యోగి మృతి' - తెలంగాణ వార్తలు

రామగుండం ఎరువుల కర్మాగారం నిర్లక్ష్యం వల్లే డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిప్రసాద్ కరోనాకు బలయ్యారని సహోద్యోగులు ఆరోపించారు. పరిస్థితి విషమించినా మెరుగైన వైద్యం అందించలేదని వాపోయారు. యాజమాన్య హత్య అంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు.

ramagundam fertilize company employees protest , fertilizer factory protest
కర్మాగారం ముందు ఉద్యోగుల ధర్నా, రామగుండం ఎరువుల కర్మాగారం
author img

By

Published : May 25, 2021, 1:28 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిప్రసాద్ కరోనాతో మృతి చెందారని సహోద్యోగులు ఆరోపించారు. మెరుగైన చికిత్స అందించకపోవడం వల్లే ప్రాణాలు పోయాయని వాపోయారు. హోం ఐసోలేషన్​లో ఉన్న రవిప్రసాద్ ఆరోగ్యం విషమించినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది యాజమాన్య హత్య అంటూ కుటుంబసభ్యులు, అధికారులు ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షలు, ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బోర్డుకు సిఫార్సు చేస్తామని అన్నారు. తక్షణ సాయం కింద రూ.పది లక్షలు, సర్వీసుకి రూ.40 వేలు చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది.

ఇదీ చదవండి: ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.