ETV Bharat / state

'అత్యవసరమైతేనే బయటకు రావాలి.. లేదంటే కఠిన చర్యలే'

అత్యవసరమైతేనే రోడ్ల మీదకు రావాలని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో రాత్రివేళలో లాక్​డౌన్ అమలు తీరును ఆయన పరిశీలించారు.

ramagundam cp on lock down, peddapalli lock down
పెద్దపల్లిలో లాక్​డౌన్, సీపీ సత్యనారాయణ
author img

By

Published : Jun 11, 2021, 8:52 AM IST

అత్యవసరమైతేనే బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపై తిరిగి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో రాత్రివేళలో లాక్​డౌన్ అమలు తీరును సీపీ పరిశీలించారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

ఈ కరోనా కాలంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు తమ ఐడీ కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ, ఒకటో పట్టణ సీఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్​తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Digital survey: 'డిజిటల్‌ సర్వేతో పొరపాట్లు జరిగే ఆస్కారం ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.