పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ పరిధిలోని 33వ డివిజన్లో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. విజయమ్మ ఫౌండేషన్ సభ్యుడు సంజీవ్ జన్మదినం సందర్భంగా మూగజీవాల దాహం తీర్చడానికి తొట్టెలు ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.
విజయమ్మ ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలవాలని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దొంత ఫౌండేషన్ సభ్యులు సతీష్, మేదరి శ్రీనివాస్, మంథని శ్రీనివాస్, లెనిన్ యుగంధర్ పాల్గొన్నారు.