నీటి ఆవశ్యకతను తెలియజేసేందుకు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారులు 'జల సంరక్షణ- జన్ ఆందోళన' పేరుతో ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలంతా నీటి సంరక్షణకు పాటుపడాలి అంటూ నినాదాలు చేశారు. ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకొని జాగ్రత్తలు పాటించాలని జిల్లా పాలనాధికారి కోరారు. ప్రకృతి ప్రసాదించిన వర్షపునీటిని ఒడిసి పట్టి నీటిని కాపాడుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండిః పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల ధర్నా