Rahul Gandhi Speech at Peddapalli Congress Vijayabheri Sabha : ఒక కుటుంబంతో ఉండే అనుబంధం.. తనకు తెలంగాణతో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీకి తెలంగాణతో మంచి అనుబంధం ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన హామీని సోనియాగాంధీ నెరవేర్చారని అన్నారు. రాజకీయంగా పార్టీకి నష్టమని తెలిసినా.. రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. పెద్దపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. ప్రజల తెలంగాణను దొరల తెలంగాణగా మార్చాలని కేసీఆర్ (KCR) చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబం ప్రజల సొమ్మును లూటీ చేసిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్లు దోచుకున్నారని.. ప్రాజెక్టులతో కేసీఆర్, గుత్తేదారులకే ప్రయోజనం కలిగిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
Rahul Gandhi Fires on KCR : కేసీఆర్‌లాగే (KCR) మోదీ కూడా అబద్ధాలు చెప్పి గెలిచారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని అన్నారని.. మరి వేశారా అని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోదీ అన్నారని.. మరి ఉద్యోగాలు వచ్చాయా అని నిలదీశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోందని రాహుల్ గాంధీ చెప్పారు.
Rahul Gandhi Comments on Modi : గ్యాస్ ధరలు పెంచి మోదీ (Modi) ప్రభుత్వం పేదలపై భారం వేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కంప్యూటరైజ్‌డ్ పేరుతో పేదల భూములను కేసీఆర్ లాక్కున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఈ పదేళ్లలో నెరవేరాయా అని ప్రశ్నించారు. రెండు పడకగదుల ఇండ్లు ఎంతమందికి ఇచ్చారో ఆలోచించాలని అన్నారు. రూ.లక్ష రుణమాఫీ ఎంతమందికి చేశారో ప్రజలు ఆలోచించాలని రాహుల్ గాంధీ సూచించారు.
"భూస్వాములు, ధనవంతులకు మేలు చేసేందుకే రైతుబంధు తెచ్చారు. కేసీఆర్, మోదీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్, మోదీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారు. మోదీ, కేసీఆర్ ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. సింగరేణి ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుతామని హామీ ఇస్తున్నా." - రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత
Revanth Reddy Fires on KCR : కులాలు, మతాల పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూసిందని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. భారత్ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ ప్రజలకు అండగా నిలిచారని.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ అని అన్నారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు జీరాక్స్ సెంటర్లలో విక్రయించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
మరోసారి మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం ఎక్కడ ఉండేదని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌కు వందల ఎకరాలు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇచ్చిన రాష్ట్రంలో సామాజిక న్యాయం దక్కాలని పార్టీ భావించిందని.. అందుకే ఆరు గ్యారెంటీలతో పేదలకు న్యాయం చేయాలని నిర్ణయించిందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
Rahul Gandhi Khammam Meeting Speech : 'కర్ణాటక తరహాలో.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం'