పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో... దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీవీ సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తె వాణీదేవీ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై... పీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ప్రధానిగా పీవీ... దేశానికి అమూల్యమైన సేవలు అందించారని... పేద, మధ్యతరగతి ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అన్ని రంగాల్లో సంస్కరణల కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. నేటి తరానికి పీవీ లాంటి మహనీయుని ఆలోచనా విధానాలను తెలిపేందుకే శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: హరితహారం మొక్కలు కోసినందుకు ఈ.3 వేల జరిమానా