పెద్దపల్లి జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. భార్య భర్తల మధ్య నెలకొన్న గొడవల కారణంగా సైకోగా మారిన అర్జున్ అనే యువకుడు పెద్దపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై తన స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టి వీరంగం సృష్టించారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్‌కు చెందిన అర్జున్ అనే యువకుడికి ఏడాది క్రితం అనూషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం సజావుగానే సాగిన వీరి సంసారంలో గత కొన్ని రోజుల నుంచి మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో అర్జున్ భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్జున్ గత కొంతకాలంగా సైకోగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న అర్జున్.. కిందకు దిగి భార్యపై కోపంతో తన స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టాడు. భారీగా మంటలు ఎగిసి పడి కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందిచడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. జరిగిన ఘటనపై బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: