పెద్దపల్లి జిల్లా అందుగులపల్లి గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మించడాన్ని నిరసిస్తూ ఆ గ్రామ ఉపసర్పంచ్, మిగతా వార్డు సభ్యులు కలిసి మంచినీటి ట్యాంకర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఒక సామాజిక వర్గానికి చెందిన స్థలంలో చెక్ డ్యామ్ నిర్మించాలని సర్పంచ్ శారద తీసుకున్న నిర్ణయమే వీరి నిరసనకు కారణమైంది.
సర్పంచ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల తమకు నష్టం జరిగే ప్రమాదం ఉందని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులతో కలిసి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.