పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన శారదా.. గర్భిణీ ప్రసవం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అయితే.. శారదకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులని కోరగా ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవం చేసినందున శిశువు మరణించినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు.
వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపించారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని బాధితులకు నచ్చజెప్పగా పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.