ETV Bharat / state

కరోనా నిర్మూలన పట్ల మోదీ చర్యలు భేష్ : సోమారపు

రెండో దఫా దేశ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీకి పెద్దపల్లి భాజపా జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్​ను నిర్మూలించేందుకు మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యల పట్ల ప్రపంచ దేశాధినేతలు కొనియాడుతున్నారన్నారు.

కరోనా నిర్మూలన పట్ల మోదీ చర్యలు భేష్ : సోమారపు
కరోనా నిర్మూలన పట్ల మోదీ చర్యలు భేష్ : సోమారపు
author img

By

Published : Jun 1, 2020, 5:11 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాజపా కార్యాలయంలో ప్రధాని మోదీ రెండో దఫా తొలి ఏడాది పదవి కాలం పూర్తయిన సందర్భంగా పెద్దపెల్లి జిల్లా భాజపా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు.

మోదీ చాకచక్యం వల్లే...

గత ఐదేళ్ళ కాలంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను చూరగొన్న గొప్ప నేత మోదీ అని ఆయన కొనియాడారు. ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న జమ్ము ప్రాంత సమస్యలను తీర్చడం సహా కేంద్రపాలిత ప్రాంతం చేయడం మోదీ అద్భుత మేధా శక్తికి నిదర్శనమని కీర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి లక్షల మంది మరణిస్తుంటే... మోదీ చాకచక్యం వల్ల 130 కోట్ల జనాభా గల దేశాన్ని నడిపిస్తోన్న తీరును ప్రపంచ దేశాలు అభినందించాయన్నారు.

ప్రతి వ్యక్తికీ బియ్యం..

ప్రజలకు కరోనా సమయంలో సహకారం అందాలని రూ. 1,70,000 కోట్లతో గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా ప్రతి వ్యక్తికి పది కేజీల బియ్యం, జన్​ధన్ యోజన ద్వారా మహిళలకు నెలకు 500 చొప్పున మూడు నెలల పాటు అందించారని కీర్తించారు. కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా రైతులకు రెండు వేల రూపాయలు సహాయం అందించే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా భాజపా నేతలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : వర్సిటీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర: భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.