ETV Bharat / state

'క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి' - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు

క్రీడారంగంలో రాణించడం వల్ల శారీరక ఉల్లాసంతో పాటుగా ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రోలర్ స్కేటింగ్​లో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను ఆయన అభినందించారు.

peddapelli mla call for we need to excel in sports and bring good name to the district
'క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి'
author img

By

Published : Jan 17, 2021, 12:34 PM IST

విద్యార్ధులు రోలర్ స్కేటింగ్​లో జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు. క్రీడలు అడటం మూలంగా మంచి ఆరోగ్యంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రోలర్ స్కేటింగ్​లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన అభినందించారు.

క్రీడారంగంలో రాణించడం వల్ల శారీరక ఉల్లాసంతో పాటుగా ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా విద్యార్ధులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లతో పాటుగా రోలర్ స్కేటింగ్ శిక్షకులు క్రిష్ణవమూర్తి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అప్పుడు.. ఇప్పుడు.. మొదటి వరసలో ఆ ఇద్దరూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.