వర్షపు నీటిని ఒడిసి పట్టి జల సంరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులతో రాజీవ్ రహదారిపై ర్యాలీ చేశారు. వృక్షాల నరికివేత వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు అందరూ జల సంరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని కోరారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్ వద్ద అంకాపూర్ ప్రజల అరెస్ట్