మావోయిస్టులకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ రవీందర్ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచామని ఆయన తెలిపారు. ముత్తారం మండలం మైదంబండ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వారంలో రాత్రి నిర్భంద తనిఖీలు నిర్వహించి గ్రామస్థులతో మాట్లాడారు.
తెలంగాణలో మావోయిస్టులు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... కేవలం వారి ఉనికిని చాటుకునేందుకు తిరుగుతూ డబ్బులు ఇవ్వని వారిని హతమారుస్తున్నారని డీసీపీ అన్నారు. వారి కదలికలను గుర్తించేందుకు కౌంటర్ యాక్షన్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మంథని నియోజకవర్గంలో అటవీప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల భూపాలపల్లి సరిహద్దులు దాటి... మావోయిస్టులు పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న సమాచారం ఉందని తెలిపారు. వారికి స్థానిక ప్రజలు, మాజీ మావోయిస్టులు ఎవరు కూడా సహకరించవద్దని అన్నారు. సహకరించినా, వారికి భయపడి డబ్బులు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: తెలంగాణ పురపాలకశాఖకు జాతీయ స్థాయి అవార్డు