ETV Bharat / state

'ప్రతి ఇంటి పెద్ద బిడ్డగా సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకున్నారు'

రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

peddapalli zp chairman putta madhu inaugurates development works at manthani
'ప్రతి ఇంటి పెద్ద బిడ్డగా సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకున్నారు'
author img

By

Published : Nov 13, 2020, 9:21 AM IST

కేసీఆర్ రైతుల పక్షపాతి అని, వారి కంట నీరు రాకుండా ప్రతి ఇంటికి పెద్ద బిడ్డగా బాధ్యత తీసుకొని అన్నదాత కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారని పెద్దపెల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమధు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్ యార్డులు సహా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

మంథని మండలంలోని నాగారం, రామగిరి మండలంలోని బేగంపేట, ముత్తారం మండలంలో మచ్చుపేట, లక్కారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మంథని మున్సిపల్ పరిధిలోని పవర్ హౌస్ కాలనీ, శ్రీరామ్ నగర్, గంగపురి ఏరియాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ ప్రారంభించారు.

రైతులకు ధాన్యం కొన్న వెంటనే రసీదు ఇచ్చే విధంగా అధికారులకు సూచనలు చేశామని, ఎవరూ ఆందోళన చెందవద్దని పుట్టమధు కోరారు. ధాన్యం కోసిన వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా పూర్తిగా ఆరబెట్టి, అధికారులు సూచించిన తేమశాతం వచ్చిన తర్వాత తీసుకురావాలన్నారు.

ఇదీ చదవండి: ఉద్రిక్తతకు దారితీసిన కరీంనగర్​ కలెక్టరేట్ ముట్టడి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.