కరోనా నివారణకు విధించిన లాక్డౌన్ వల్ల ఎవరూ ఆకలితో అలమటించకూడదని ఎంపీ వెంకటేశ్ నేత అన్నారు. అంతర్గాం మండలంలోని పలుగ్రామాల పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
తెలంగాణ ప్రజల ఆరోగ్యం, ప్రాణాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ తెలిపారు. రామగుండం నియోజవర్గంలోని ప్రజలకు తమ వంతుగా విజమయ్మ ఫౌండేషన్ ద్వారా నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రభుత్వానికి సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.