రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లోని అమ్ముకొని మద్దతు ధర పొందాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న మహాలక్ష్మి, శ్రీరామ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. గురువారం క్వింటాల్ పత్తికి ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర రూ.5,825/- పొందాలంటే పత్తిలో తేమ 8 శాతం మాత్రమే ఉండేలా మార్కెట్ కు తీసుకురావాలని కోరారు. తేమ శాతం అధికంగా ఉంటే మద్దతు ధర కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
రైతులు దళారులను ఎట్టి పరిస్థితిలోఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని కోరారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: ఆలయ భూములను కూడా వదలని భూకబ్జాదారులు