ETV Bharat / state

Villagers obstruct mla convoy: ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. రాజీనామా చేయాలంటూ... - తెలంగాణ వార్తలు

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామస్థులు ఎమ్మెల్యే కాన్వాయ్​ను అడ్డగించారు. రోడ్లు నిర్మించకపోతే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

Villagers obstruct mla convoy, mla dasari manohar reddy news
ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డగింత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి చేదు అనుభవం
author img

By

Published : Nov 6, 2021, 12:56 PM IST

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. తమ గ్రామంలో అధ్వానంగా మారిన రహదారిని పునరుద్ధరించాలని సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలకు భాజపా, కాంగ్రెస్ స్థానిక నాయకులు మద్దతు తెలిపారు. కొదురుపాక గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు వెళ్లిన ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. మనోహర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఏడేళ్లుగా గ్రామంలో రోడ్డు గుంతలమయం అయిందని.. ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి నిర్మించకపోతే రాజీనామా చేయాలని వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కాన్వాయ్​కు అడ్డుగా బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అరగంట పాటు అడ్డుకోవడంతో పోలీసులు ఆందోళనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అరెస్టు చేసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ఇదీ చదవండి: పేకాట కేసులో ఐదుగురు అరెస్టు.. రూ.12.66 లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.