ETV Bharat / state

మొక్కలకు నీళ్లు పోసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ - మొక్కలకు నీళ్లు పోసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

నర్సరీ మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వాటర్ డేను పురస్కరించుకొని కలెక్టర్ మొక్కలకు నీళ్లు పోశారు.

peddapalli collector siktha patnaiak
మొక్కలకు నీళ్లు పోసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
author img

By

Published : May 8, 2020, 6:58 PM IST

పెద్దపల్లి జిల్లాలోని పెద్దకాల్వల గ్రామంలో నర్సరీ, ఉపాధి హామీ పనులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. కొవిడ్-19 నియంత్రణ చర్యలు పాటిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. ఉపాధిహామీ కార్మికులను వినియోగిస్తూ గ్రామంలో నాటిన మొక్కల సంరక్షణ, నర్సరీ నిర్వహణ పకడ్బందీగా చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న సమయంలో కార్మికులంతా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మొక్కల సంరక్షణకు నీటి సరఫరా చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. శుక్రవారం వాటర్ డేను పురస్కరించుకొని కలెక్టర్ మొక్కలకు నీరు పోశారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.