పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో వలస కార్మికులు, విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై ఉన్నతాధికారులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. ఎన్టీపీసీలో నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు జరిగేటప్పుడు కార్మికులంతా భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, రామగుండం ఎన్టీపీసీ ఈడి రాజకుమార్, పోలీస్ కమిషనర్ డీఐజీ సత్యనారాయణ, జిల్లా ఇంఛార్జి రెవెన్యూ అధికారి నరసింహమూర్తి పాల్గొన్నారు.