ETV Bharat / state

అక్రమ రేషన్​ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు - అక్రమ బియ్యం పట్టుకున్న రామగుండు పోలీసులు

అక్రమంగా రాష్ట్రం దాటిస్తున్న రేషన్​ బియ్యాన్ని రామగుండం టాస్క్​ఫోర్స్ పోలీసులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో సేకరించిన పీడీఎస్​ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు బియ్యం తరలింపుదారులను పట్టుకున్నారు.

PDS Rice Transporting Illegally Caught By Ramagundam police
అక్రమ రేషన్​ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు
author img

By

Published : May 19, 2020, 10:05 AM IST

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​, జూలపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో సేకరించిన పీడీఎస్​ బియ్యాన్ని మహారాష్ట్రకు చెందిన లారీలో అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో బియ్యంతో సహా.. లారీని పట్టుకున్నారు. సుల్తానాబాద్​ ప్రాంతంలో పోలీసులు కాపు కాసి.. రూ.5 లక్షలు విలువ చేసే.. 350 క్వింటాళ్ల రేషన్​ బియ్యం, నలుగురు వ్యక్తులను ఆధీనంలోకి తీసుకున్నట్టు రామగుండం కమిషనర్​ సత్యనారాయణ తెలిపారు.

లాక్​డౌన్​ సమయంలో ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు అందించిన బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తక్కువ రేటుకు కొని.. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు తరలించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రామగుండం సీపీ తెలిపారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై పీడీ యాక్ట్​ నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇవీ చూడండి: 'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.