ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత - acp

అక్రమంగా తరలిస్తున్న 360 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

పీడీఎస్ బియ్యం పట్టివేత
author img

By

Published : Apr 15, 2019, 11:19 PM IST

పెద్దపల్లి జిల్లా ఎక్లాస్​పూర్ వద్ద పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 360 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో రెండు వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తుండగా... స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ తెలిపారు.

పీడీఎస్ బియ్యం పట్టివేత

ఇవీ చూడండి: ఈసీ డౌన్ డౌన్.... వెల్లువెత్తిన జనాగ్రహం..

పెద్దపల్లి జిల్లా ఎక్లాస్​పూర్ వద్ద పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 360 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో రెండు వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తుండగా... స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ తెలిపారు.

పీడీఎస్ బియ్యం పట్టివేత

ఇవీ చూడండి: ఈసీ డౌన్ డౌన్.... వెల్లువెత్తిన జనాగ్రహం..

Intro:Tg_mbnr_15_15_Adugantina_jurala_Pkg_C12
అడుగంటిన జూరాల.
కనిష్ట స్థాయికి చేరిన కృష్ణమ్మ నీటిమట్టం.
2016 నాటి పరిస్థితి పునరావృతం.
ప్రశ్నార్థకంగా తాగునీటి పథకాలు.


Body:వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం లోని జూరాల ప్రాజెక్టు అడుగంటింది. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వరదాయిని జూరాల ప్రాజెక్ట్ అడుగంటడంతో నిలువ నీటి వినియోగంలో ముందు చూపు లేకపోవడం ప్రస్తుత వేసవిలో శాపంగా మారింది. ప్రాజెక్టు అధికారులు నిలువ నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన ఫలితం లేకపోయింది. ఏప్రిల్ నెలలోనే నిలువ నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోయింది, దీంతో అధికారులు నారాయణపూర్ డాం నుంచి మూడు టీఎంసీల నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తొలకరి వర్షాలు కురిసే నాటి వరకు ప్రాజెక్టు నిలువ నీటిపై ఆధారపడిన తాగునీటి పథకాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జూరాల ప్రాజెక్టు తోపాటు రామన్ పాడు గోపాల్ దిన్నె జలాశయాలను నీటి మట్టం వేగంగా తగ్గుతుంది. ప్రాజెక్టులో అడుగంటిన నిలువ నీటిని వినియోగించడంలో 2016 నాటి పరిస్థితి పునరావృతమయ్యే దుస్థితి తప్పదంటున్నారు. ప్రాజెక్టులో నిలువ నీటి మట్టం వేగంగా పడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. 2016లో జూరాల ప్రాజెక్టు లో నిలువ నీటి మట్టం అడుగంటిన సందర్భంగా తాగునీటి అవసరాల కోసం తాత్కాలిక విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని ప్రధాన ఎడమకాలువకు ఎత్తి పోశారు ఈ నీరు రామన్పాడు జలాశయానికి చేరడంతో తాగునీటి పథకాల నీటి అవసరాలు తీరాయి. ఇందుకు అప్పట్లో రూపాయలు 50 లక్షల నిధులను ఇందుకు వ్యయం చేశారు. మరో వంద రోజులు కు సరిపడా నీరు సమకూరే పరిస్థితి లేకపోవడంతో అడుగంటిన నీటిని కాలువ హెడ్రెగ్యులేటర్ వద్దకు తోడి పోసేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు జూరాల పై ఆధారపడిన సుమారు 1600 గ్రామాలకు త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు అసలే వేసవి కాలం కావడంతో మిషన్ భగీరథ పేరుతో పాత పైపులు తొలగించి కొత్త పైపులైన్ల వేస్తామని చెప్పి నెలలు కావస్తున్నా ఇప్పటికీ పని చేయకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూరాల క్యాంపు కార్యాలయాల వసతి గృహాల్లోనే త్రాగునీటి సమస్య ఏర్పడడం గమనార్హం. జూరాలలో నీటి మట్టం పడిపోవడంతో రెండో పంటకు సాగునీరు ఇవ్వకపోగా కనీసం ప్రజల దాహార్తిని తీర్చడానికై నా జూరాల నీటిమట్టం నిల్వ ఉంచకుండా నీటిని విడుదల చేశారని ఆయకట్టు రైతులు ప్రజలు వాపోతున్నారు.జూరాల ప్రక్కనే ఉన్న నందిమళ్ల, కిష్టంపల్లి మస్తిపూర్ వంటి గ్రామాల్లో సైతం నీరు లేక పొలాల్లో బోరుల ద్వారా త్రాగునీటిని తెచుకుంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. నారాయణపూర్ డ్యామ్ నుండి 3 టిఎంసిల నీటిని వదిలితే త్రాగునీటి సమస్య తీరుతుందని అధికారులు స్పందించి తొందరగా నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


Conclusion:ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ మట్టం : 318.516 మీటర్లు.(9.657 టీఎంసీ లు).
ప్రస్తుతం ఉన్నది : 312.063 మీటర్లు( 2.063 టిఎంసిలు).
ఆవిరవుతున్న నిలువ నీరు : 92 క్యూసెక్కులు .
ఇతర అవసరాలకు వాడుతున్న నీరు : 70 క్యూసెక్కులు.
బైట్స్:
1) చుక్క లింగా రెడ్డి.
2)హరిశ్చంద్ర రెడ్డి.
3)కృష్ణవర్ధన్ రెడ్డి.
4)వెంకటేశ్వర రెడ్డి.
5)శ్రీనివాసులు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.