ETV Bharat / state

తల్లిదండ్రులను దైవంగా భావించాలి: పెద్దపల్లి మేయర్​ - గోదావరి ఖని వార్తలు

తల్లిదండ్రులు, గురువులను దైవంగా భావించాలని పెద్దపల్లి మేయర్​ అనిల్​ కుమార్​ విద్యార్థులకు సూచించారు. గోదావరి ఖనిలోని ఓ పాఠశాల ఫ్యామిలీ పారడైస్​ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.

తల్లిదండ్రులను దైవంగా భావించాలి: పెద్దపల్లి మేయర్​

author img

By

Published : Feb 22, 2020, 7:39 PM IST

పెద్దపెల్లి జిల్లా గోదావరి ఖని సంజయ్ గాంధీ నగర్​లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ పారడైస్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు, గురువులను దైవంగా భావించాలని మేయర్​ అనిల్​ కుమార్​ హితవు పలికారు. అలాగే మంచి నడవడికతో భవిష్యత్తులో ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు.

తల్లిదండ్రుల పాదాలను చిన్నారులు కడిగి పాదాభివందనం చేశారు. అనంతరం పిల్లలను తల్లిదండ్రులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కుమార స్వామితో పాటు మండల విద్యాధికారి డేనియల్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులను దైవంగా భావించాలి: పెద్దపల్లి మేయర్​

ఇవీ చూడండి : బ్రహ్మ, విష్ణువు తగువు తీర్చిన రోజు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.