ETV Bharat / state

'ప్రజల భాగస్వామ్యంతోనే పల్లె పారిశుద్ధ్యం సాధ్యం'

పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య పనుల్లో భాగస్వామ్యం అవ్వాలని ఆయన సూచించారు.

palle pragathi program started by the mla chander in peddapalli
'ప్రజల భాగస్వామ్యంతోనే పల్లె పారిశుద్ధ్యం సాధ్యం'
author img

By

Published : Jun 1, 2020, 7:45 PM IST

దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలను నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నరని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వెంనూర్ గ్రామంలో 3వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చందర్ ప్రారంభించారు.

పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు అనే విధంగా ప్రతి గ్రామం పచ్చదనంతో విరాజిల్లాలని దానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణతోపాటు తమ పరిసరాలను, నాలాలను, వాటర్ ట్యాంక్​లను, చెట్ల పరిసరరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని.. ప్రతి ఒక్కరు శుభ్రతను పాటిస్తూ అంటువ్యాధులకు దూరంగా ఉండాలన్నారు.

ఇవీచూడండి: వర్సిటీల ప్రైవేటీకరణకు ప్రభుత్వ కుట్ర: భట్టి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.