ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చందర్ గ్రామ సమస్యలు తెలుకోవడానికి పల్లె నిద్ర చేశారు. ఉదయం ఆరు గంటలకే మండల స్థాయి అధికారులతో కలసి గ్రామంలోని అన్ని వీధులు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం చేయాలని అదేశించారు. తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్లుగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు పూర్తిస్థాయిలో చేరుతున్నాయో లేదో తెలుసుకోవడం కోసం గ్రామంలో పల్లె నిద్ర చేపట్టినట్లు చందర్ తెలిపారు. ఇప్పటివరకు పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉంటే అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్