పెద్దపల్లికి చెందిన జావిద్ పాషా, సాజిదా సుల్తానా రేకుర్తిలో స్థిరపడ్డారు. 2004 ఏప్రిల్ 4వ తేదీన సాదిఖ్ జన్మించాడు. చిన్ననాటి నుంచి సాదిఖ్ చురుగ్గా ఉండటంతో దంపతులు సంబరపడిపోయారు. కానీ 2014లో సాదిఖ్ అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా బ్లడ్ క్యాన్సర్ నాల్గో స్టేజిలో ఉన్నట్లు గుర్తించారు.
కేవలం వారం రోజులే బతికే అవకాశం ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ బాధ్యురాలు పుష్ప సాదిఖ్ను కలిశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కావాలన్న తన కోరికను సాదిఖ్ తెలిపాడు. ఈ కోరికను అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అంగీకరించారు. 2014అక్టోబర్ 16న సాదిఖ్ ఒకరోజు కమిషనర్గా చేశారు. ఇన్ని రోజులు ఆరోగ్యంగానే ఉన్న సాధిఖ్ నెలరోజులుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ గురువారం సాయంత్రం చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: వృద్ధ దంపతులు సజీవదహనం