ETV Bharat / state

కక్ష్య కట్టి గొడ్డలి పట్టి

తరచూ గొడవ పడుతుండేవాడు. ఎన్నిసార్లు మందలించినా... తీరు మార్చుకోలేదు. చేసేదేమిలేక ఊరి నుంచి పంపించేశారు. దాన్ని మనసులో పెట్టుకుని దారుణానికి పాల్పడ్డాడో కిరాతకుడు.

60 ఏళ్ల వృద్ధురాలు మృతి
author img

By

Published : Mar 2, 2019, 6:16 AM IST

Updated : Mar 2, 2019, 8:14 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ముబారక్​నగర్​లో దారుణం చోటు చేసుకుంది. సమ్మెట బాలమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి పక్కన ఉండే నంగునూరి నరేష్​ గొడ్డలితో కిరాతకంగా నరికాడు. తల్లి అరుపులు విని కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేయగా... బెదిరించి పరారయ్యాడు నిందితుడు.

పాత కక్ష్యలతోనే...
ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్న బాలమ్మ ఇంటి పక్కన ఉన్న యువకుడు నరేష్​ తరచూ ఘర్షణ పడుతుండేవాడు. పోలీసులు మందలించినా నరేష్ ప్రవర్తనలో మార్పులేకపోయేసరికి గ్రామం నుంచి పంపించేయాలని సూచించారు. కొన్నిరోజులుగా నిందితుడు బంధువుల వద్ద ఉంటున్నాడు.

మాటు వేసి...
బాలమ్మ కుటుంబంపై ఉన్న పాత కక్ష్యలతోనే నరేష్​... రెండు రోజులుగా మాటు వేసి... హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
కళ్ల ముందే చనిపోయిన తల్లిని చూసి కుమారులు, కోడళ్లు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

60 ఏళ్ల వృద్ధురాలు మృతి

ఇవీ చూడండి:యాసంగికి ఏర్పాట్లు చేయండి

undefined

Intro:దూల్పేట్ లో కుస్తీ పోటీలు నిర్వహించారు

Body:దూల్పేట్ లో కుస్తీ పోటీలు నిర్వహించారు

Conclusion:హైదరాబాద్: ఈరోజు దూల్పేట్ లోని మినీ స్టేడియంలో మూడవ సుభాష్ చంద్రబోస్ కుస్తీ పోటీలను నిర్వహించారు...
ఈ పోటీల్లో సుమారు 300 మంది పహిల్వాన్లు పాల్గొన్నారు.
ప్రతి సారి ఇలా కాకుండా ఈసారి ఎర్ర మట్టి లో కుస్తీలు నిర్వహించారు. కుస్తీ నిర్వాహకులు వికీ మాట్లాడుతూ ఈ మట్టి కుస్తీలు అంతరించిపోతున్నాయని అలా జరగకుండా ఈసారి తాము ఈ కుర్చీలను నిర్వహించినట్లు తెలిపారు. అదే కాకుండా క్రీడల్లో ఈ కుస్తీ లకు ప్రాముఖ్యత ఇచ్చి వీరిని ప్రోత్సహించాలని కోరారు.
బైట్:వికీ ( నిర్వాహకుడు)
Last Updated : Mar 2, 2019, 8:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.