ETV Bharat / state

ప్రారంభమైన నందిమేడారంలోని ఐదోమోటారు - నందిమేడారం

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి ఎత్తి పోతకు మరో పంపు సిద్ధమైంది. నందిమేడారంలోని ఆరో ప్యాకేజీలో ఐదో మోటారు వెట్​రన్ విజయవంతంగా నిర్వహించారు. మేడిగడ్డ నుంచి నందిమేడారం వరకు అన్నీ పంపులు సిద్ధమయ్యాయి.

ప్రారంభమైన నందిమేడారంలోని ఐదోమోటారు
author img

By

Published : Jul 31, 2019, 11:52 AM IST

పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని ఆరో ప్యాకేజీలోని ఐదో మోటారు వెట్​రన్​ను విజయవంతంగా నిర్వహించారు. దీనిని ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితో కలిసి ప్రాజెక్టు ఈఎన్‌సీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పక్షం రోజుల్లో మధ్యమానేరు జలాశయానికి కాళేశ్వరం జలాలను తరలిచేందుకు పనులను వేగవంతం చేస్తున్నామని ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు చెప్పారు. మేడిగడ్డ నుంచి నందిమేడారం వరకు అన్నీ పంపులు నీటి ఎత్తిపోతలకు సిద్ధమయ్యాయని తెలిపారు. ఈ నెల 5 వరకు ఏడో ప్యాకేజీ, ఎనిమిదో ప్యాకేజీ పంపుహౌస్​లను పూర్తిచేస్తామని, ఇప్పటికే బిగింపు పూర్తయిన పంపుల ద్వారా వరద కాలువలోకి నీటిని ఎత్తిపోస్తున్నామని పేర్కొన్నారు. వరద కాలువ నుంచి మధ్యమానేరులోకి జలాలు చేరుతున్నాయన్నారు.

ప్రారంభమైన నందిమేడారంలోని ఐదోమోటారు

ఇదీ చూడండి: జలకళ సంతరించుకున్న ప్రియదర్శిని జూరాల

FILE:TG_KRN_01_32_NANDI MEDARAM_WET RUN_SUCESS_AV_3038228 FROM:MD.Aleemuddin,karimnagar Camera:Thirupathi Note:దీనికి సంబంధించిన ఫోటోలు Desk whatsapp ద్వారా పంపించాను.. -------------------- ()పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని ఆరో ప్యాకేజీలోని అయిదవ మోటార్ వెట్రన్ విజయవంతంగా నిర్వహించారు. పక్షం రోజుల్లో మధ్యమానేరు జలాశయానికి కాళేశ్వరం జలాలను తరలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నామని ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు చెప్పారు. ధర్మారం మండలం నందిమేడారంలోని ఆరో ప్యాకేజీ పంప్‌హౌస్‌లో అయిదో పంపు వెట్‌రన్‌ను ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితో కలిసి ఈఎన్‌సీ మంగళవారం రాత్రి ప్రారంభించారు.ప్రస్తుతం మేడిగడ్డ నుంచి నందిమేడారం వరకు అన్ని పంప్‌హౌస్‌లు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. కన్నెపల్లిలో ఏడు, అన్నారంలో ఐదు పంపులను విజయవంతంగా నడిపిస్తున్నామని చెప్పారు. గోలివాడ పంప్‌హౌస్‌లోనూ ఒక పంపుకు డ్రైరన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. నందిమేడారంలోని అయిదో పంపు వెట్‌రన్‌తో కాళేశ్వరం నుంచి నందిమేడారం వరకు అన్ని పంప్‌హౌజ్‌లు ఎత్తిపోతలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గోలివాడ పంప్‌హౌస్‌లోని అన్ని పంపులకు నాలుగైదు రోజుల్లో వెట్‌రన్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని బ్యారేజీల వద్ద పంపులను సిద్ధంగా ఉంచుతామని, ఎల్లంపల్లికి ఎగువ నుంచి ఎత్తిపోతలకు సరిపడా వరద రానప్పుడే దిగువ నుంచి ఎత్తిపోస్తామని చెప్పారు. ఈ నెల 5 వరకు ఏడో ప్యాకేజీ పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత రెండ్రోజుల్లోగా నందిమేడారం చెరువు నుంచి లక్ష్మీపూర్‌లోని ఎనిమిదో ప్యాకేజీ పంప్‌హౌజ్‌కు నీటిని వదులుతామని తెలిపారు. ఇప్పటికే బిగింపు పూర్తయిన పంపుల ద్వారా వరద కాలువలోకి నీటిని ఎత్తిపోస్తామని పేర్కొన్నారు. వరద కాలువ నుంచి మధ్యమానేరులోకి జలాలు చేరుతాయన్నారు.VISUALS+PHOTOS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.