కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ క్రీడామైదానంలో ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొని జాతీయ జెండాతో పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగిన నిరసన ర్యాలీ నగరపాలక కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మంది ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.
'పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి' - 'ఎన్ఆర్సీ చట్టాన్ని రద్దు చేయాలి'
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
!['పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి' Muslims rally against NRC BILL in Peddapalli district Godawarikhani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5536857-944-5536857-1577696698948.jpg?imwidth=3840)