పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో తొలిసారి జరుగుతున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం మంథని జూనియర్ కళాశాల మైదానంలో సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. పంపిణీ అనంతరం సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు.
మంథని మున్సిపల్లో 13 వార్డులు ఉండగా 50 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 13 పోలింగ్ స్టేషన్లు, 26 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 12,754 మంది ఓటర్లు ఉండగా అందులో 6,498 మంది స్త్రీలు, 6,256 మంది పురుషులు ఉన్నారు.
ఇవీ చూడండి: జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!