పెద్దపల్లి జిల్లా రామగుండంలో బ్రిటిష్ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గోదావరిఖనిలో ధ్వజమెత్తారు. రామగుండం నగరపాలక సంస్థలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో కాంగ్రెస్ కార్పొరేటర్ల డివిజన్లలో వివక్షత చూపిస్తున్నారని కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అరెస్టులు చేయటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కార్పొరేషన్ హాల్లోకి పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిరసన చేస్తుంటే... అర్ధరాత్రి మహిళ కానిస్టేబుళ్లు లేకుండా తమ పార్టీకి చెందిన మహిళ కార్పొరేటర్లను ఎలా అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ, రామగుండం సీపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లను అర్థరాత్రి వాహనాల్లో తిప్పుతూ... జనసంచారం లేని చోట వదిలివేయాడాన్ని త్రీవంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.