ETV Bharat / state

కాంగ్రెస్​ హయాంలో ఎంతో చేశాం: ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు - peddapalli district latest news

మంథని డివిజన్​లోని 75 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

mla sridher babu distributed kalyana laxmi cheques at manthani
కాంగ్రెస్​ హయాంలో ఎంతో చేశాం: ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు
author img

By

Published : Dec 20, 2020, 2:31 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎంతో చేశామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా మంథనిలోని తన క్యాంపు కార్యాలయంలో డివిజన్​లోని 75 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

తెరాస ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన జీఎస్టీ నిధులు, టాక్స్ నిధులను తేకుండా.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఎమ్మెల్యే ఆరోపించారు. అన్ని విషయాల్లోనూ సీఎం కేసీఆర్​ కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, దేశంలోని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కోట్ల విలువ చేసే స్థలాలున్నా.. ఆదాయం సున్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.