ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తామని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన 84వ జయంతిని పురస్కరించుకుని మంథని కేంద్రంలోని విగ్రహానికి శ్రీధర్‌బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మంథనిలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు, పాలు, పండ్లను శ్రీధర్‌బాబు పంపిణీ చేశారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పక్షాన ప్రజలకు తాము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని శ్రీపాదరావుకు నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: దోస్తులతో కలిసి.. కమలం, హస్తం కుస్తీ!