రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరిహారం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలికలో నిర్వహించిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు.
రాష్ట్రంలో కాలుష్యరహిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. వాతావరణ సమతుల్యత కాపాడాల్సిన బాధ్యత.. ప్రతి ఒక్కరిపై ఉందని.. ప్రజలంతా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరుకంటి చందర్ కోరారు. సింగరేణి యాజమాన్యం పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటడం సంతోషకరమన్నారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి