పండించిన పంటను అమ్మకోలేక నానా అవస్థలు పడుతున్నారు మిర్చి రైతులు. పెద్దపల్లి జిల్లాలో 800 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మార్చి మొదటి వారంలో జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు కురవడం వల్ల మిర్చి రైతులు ఆందోళనకు గురయ్యారు. కానీ పెద్ద నష్టం ఏమీ సంభవించలేదు.
క్వింటాకు రూ.15,000
మిర్చి క్వింటాకు రూ.15,000 ఉండడం వల్ల కూలీలకు ఇబ్బంది ఎదురైనా పంట తీశారు. అంత బాగానే ఉన్నా ఇప్పుడు అమ్మడం పెద్ద పనిగా మారింది. లాక్డౌన్తో రవాణా ఆగిపోవడం వల్ల పంటను మార్కెట్కు తీసుకెళ్లలేకపోతున్నారు.
కూలీలకు డబ్బులు ఇవ్వలేక
రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల మిర్చి పంట పొలాల వద్ద నిల్వ ఉండిపోతుంది. కూలీలకు డబ్బులు ఇవ్వలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిర్చి పంట సాగు చేసే సమయంలో ఎరువులు, పురుగుల మందులు ఇచ్చిన వ్యాపారస్తులు డబ్బులు చెల్లించాలని రైతన్నలపై ఒత్తిడి తేవడం వల్ల ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం