ETV Bharat / state

మీ ఎన్​ఆర్​ఐ అల్లుళ్లూ ఇలాగే చేస్తున్నారా? - అక్కడ ఒక్క కంప్లైంట్ ఇస్తే ఎగిరిపోయినోళ్లనూ వలేసి పట్టిస్తారు! - TELANGANA POLICE NRI WING

భార్యను వదిలి విదేశాలకు వెళుతున్న ప్రవాస భర్తలపై చర్యలు - ప్రవాస అల్లుళ్లు గృహ హింసలకు పాల్పడితే కటకటాలే - విదేశాల్లో ఎక్కడున్నా స్వదేశానికి రప్పిస్తున్న తెలంగాణ పోలీస్​ ఎన్​ఆర్​ఐ సెల్

Telangana Police NRI Wing
Telangana Police NRI Wing (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2024, 12:37 PM IST

Telangana Police NRI Wing : వివాహం అనంతరం భార్యను భారత్​లో వదిలేసి విదేశాల్లో మకాం వేస్తున్న ప్రవాస అల్లుళ్లకు వార్నింగ్. ప్రవాస అల్లుళ్ల కుటుంబాలు భారత్​లో కోడళ్లపై పాల్పడుతున్న గృహహింస విషయంలో కూడా స్వీట్​ వార్నింగ్. ఎందుకంటే వారు ఎలాంటి చర్యలకు పాల్పడినా ఎన్​ఆర్​ఐ సెల్ ఉందనే విషయాన్ని మరవకూడదు. ఆడవాళ్లకు ఏదైనా జరిగితే ఇక ఎన్​ఆర్​ఐకి, ఎన్​ఆర్​ఐ కుటుంబానికి తాట తీస్తారు. బాధిత మహిళలకు న్యాయ సహాయం చేస్తూ ఎన్నో కేసులకు పరిష్కారం చూపింది ఈ సెల్.

విదేశాల్లో మహిళలు ఉన్నప్పటికీ గృహ హింసను ఎదుర్కొంటున్న బాధితురాళ్ల తరఫున వారి కుటుంబసభ్యులు ఇక్కడ ఫిర్యాదు చేస్తున్న కేసులకు ఎన్​ఆర్​ఐ సెల్​ పరిష్కారం అందిస్తోంది. ఇలా తెలంగాణలోని 23 మహిళా పోలీస్​ స్టేషన్​లలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తులో స్థానిక పోలీసులకు సహకరిస్తోంది. అలాగే ప్రవాస అల్లుళ్లపై లుక్ ​అవుట్​ నోటీసులు, పని చేస్తున్న కంపెనీల ద్వారా ఒత్తిళ్లు, నాన్ ​బెయిలబుల్ వారంట్ల జారీ, పాస్ ​పోర్టులు రద్దు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.

నిందితులను ఇక్కడకు తీసుకు రావడానికి ఎంత శ్రమిస్తున్నారో, తీసుకొచ్చాక సీడీఈడబ్ల్యూ సంస్థ ద్వారా నిపుణులతో వారికి కౌన్సెలింగ్​ చేయించడం, కాపురాలు నిలబెట్టడంతో కూడా అంతే శ్రమిస్తున్నారు. కలిపిన తర్వాత వదిలేయకుండా వారి బాగోగులు సైతం తరచూ అడిగి తెలుసుకుంటున్నారు.

ఆస్ట్రేలియాలో విభేదాలు - హైదరాబాద్​లో రాజీ : హైదరాబాద్​ అల్వాల్​కు చెందిన యువతికి 2011లో వివాహం అయింది. భార్యాభర్తలిద్దరూ ఏడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారికి అక్కడే అమ్మాయి జన్మించింది. భర్త వేరొకరితో వివాహేతర సంబంధం నెరపుతున్నారనే కారణంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. వెంటనే ఆమె అక్కడి నుంచి హైదరాబాద్​ తిరిగొచ్చి అల్వాల్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. వెంటనే తెలంగాణ మహిళ భద్రత విభాగంలోని ఎన్​ఆర్​ఐ సెల్​ను సంప్రదించగా, భర్తకు లుక్​ అవుట్​ సర్క్యూలర్​ను పోలీసులు జారీ చేశారు. వెంటనే అతడిని భారత్​కు రప్పించారు. నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్​ ఇవ్వగా, భార్యభర్తలిద్దరూ కలిసిపోయారు. ఆయన అక్కడి ఉద్యోగాన్ని ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్​కు మార్పించుకున్నారు. ఇప్పుడు సుఖంగా ఉన్నారు.

భార్యతో రాజీపడి దుబాయ్​కు : 2019లో దుబాయ్​లో పని చేసే వ్యక్తితో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మహిళకు వివాహం అయింది. కుమారుడు పుట్టిన తర్వాత అతడు దుబాయ్​ వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి రూ.2 లక్షల కట్నం కోసం వేధించేవాడు. ఆమె 2022లో కోరుట్ల పోలీస్​ స్టేషన్​లో గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. ఎన్​ఆర్​ఐ సెల్​ను సంప్రదించారు. అతనిపై లుక్​ అవుట్ సర్క్యులర్​ జారీ చేసి, అతడు పని చేసే దుబాయ్ కంపెనీకి నోటీసును పంపించింది. అతడిని ఇక్కడికి రప్పించి, కౌన్సెలింగ్ ఇవ్వగా భార్యతో రాజీపడి దుబాయ్​కు కాపురానికి తీసుకెళ్లాడు.

భార్యను వదిలేసి కువైట్​ వెళ్లిపోయిన భర్త : హైదరాబాద్​ పాతబస్తీకి చెందిన మహిళా అసిస్టెంట్​ ప్రొఫెసర్ ఓ వ్యక్తిని రూ.20 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అదే సమయంలో ఆమె భర్త కువైట్​ వెళ్లి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. తనను గృహహింస కింద హింసిస్తున్నారని, మహిళా పోలీసు స్టేషన్​లో అత్తమామలపై కూడా కేసు పెట్టింది. లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేసిన పోలీసులు పాస్​పోర్టును రద్దు చేశారు. భారత్​కు రప్పించి న్యాయస్థానంలో హాజరుపర్చగా, ప్రస్తుతం ఇరువర్గాల మధ్య రాజీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

కేసుల వివరాలు : తెలంగాణ మహిళ భద్రత విభాగంలో 2019లో ఎన్​ఆర్​ఐ సెల్​ ఏర్పాటు అయింది. నాటి నుంచి ఇప్పటివరకు 463 కేసులు నమోదు కాగా, వాటిల్లో 153 కేసులను పరిష్కరించారు. 224 మంది ప్రవాస అల్లుళ్లపై లుక్​ అవుట్​ సర్క్యులర్​ (ఎల్​వోసీ)లు జారీ అయ్యాయి. ప్రవాస అల్లుళ్లపై 139 నాన్​ బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. 19 కేసుల్లో నిందితుల పాస్​పోర్టులు రద్దు చేశారు. 94 కేసుల్లో నిందితుల పాస్​పోర్టు వివరాలను హైదరాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్టు కార్యాలయం పాలసీ డేటాలో నమోదు చేశారు. 62 కేసుల్లో నిందితులను విదేశాల నుంచి వెనక్కి రప్పించేందుకు భారతీయ ఎంబసీలతో సంప్రదింపులు జరిపారు. 53 కేసుల్లో ప్రవాస అల్లుళ్లను భారత్​కు రప్పించి న్యాయ విచారణకు హాజరు పరిచారు.

ఈ నంబర్లను సంప్రదించండి : తెలంగాణ మహిళ భద్రత విభాగం ఎన్​ఆర్​ఐ సెల్​ను బాధితులు నేరుగానే కాకుండా ఈ-మెయిల్, రిజిస్టర్​ పోస్ట్, వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. యూట్యూబ్​లోనూ వివరాలు తెలుసుకోవచ్చు. Women Safety Wing, Telangana Police అనే వీడియోల్లోనూ వివరాలను తెలుసుకోవచ్చు.

  • వాట్సప్ : +91 8712656858
  • ఎక్స్‌: @ts_womensafety
  • ఫోన్‌ నంబర్‌: 040 27852246
  • Mail Id : tsnricell.wsw@gmail.com & nricell-ts-wsw@tspolice.gov.in

NRI Marriage Frauds : తొలి రాత్రే ఆ రహస్యం తెలిసింది..

అందాల పోటీల్లో గెలిస్తే ఎన్​ఆర్​ఐతో పెళ్లి.. వెరైటీ ఆఫర్​ ఇచ్చిన వారు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.