ETV Bharat / entertainment

'అన్​స్టాపబుల్'​లో కంగువా హీరో! - ఆడియెన్స్​ ముందు కంటతడి పెట్టిన సూర్య! - UNSTOPPABLE SEASON 4 SURIYA EPISODE

అన్​స్టాపబుల్​లో 'కంగువా' టీమ్​ సందడి - ప్రోమో చూశారా?

Unstoppable Season 4 Suriya Episode
Unstoppable Season 4 Suriya Episode (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 1:00 PM IST

Unstoppable Season 4 Suriya Episode : నందమూరి నటసింహం బాలకృష్ణ పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌' సీజన్ 4 సూపర్ సక్సెస్​గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుండగా, తాజాగా మరో స్టార్ హీరో ఈ వేదికపై సందడి చేశారు. ఆయనెవరో కాదు స్టార్ హీరో సూర్య. తన అప్​కమింగ్ మూవీ 'కంగువా' ప్రమోషన్స్​లో భాగంగా ఆయన ఈ కార్యక్రమానికి తన టీమ్​తో విచ్చేశారు. బాబీదేవోల్‌, దర్శకుడు శివ కూడా బాలకృష్ణతో సరదగా గడిపారు. అందులో సినిమాతో పాటు తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇక కాసేపటి తర్వాత బాలకృష్ణ కార్తికి లైవ్‌లో ఫోన్‌ చేశారు. ఆ సమయంలో వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఓ హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని చెప్పారు. దీంతో కార్తిని సూర్య 'నువ్వు కార్తివి కాదు. కత్తివి రా' అంటూ ఫన్నీగా అన్నారు. అయితే ఆ తర్వాత జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనంటూ సూర్య ఎమోషనయ్యారు. అంతేకాకుండా తన సేవా కార్యక్రమాల గురించి కూడా ఈ ఎపిసోడ్​లో మాట్లాడారు. మానవత్వం ఉన్న ఓ సగటు మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందంటూ పేర్కొన్నారు. దీంతో బాలయ్యతో పాటు అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు.

ఇక 'కంగవా' విషయానికి వస్తే, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్, యంగ్ స్టార్ దిశా పటానీ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సాలిడ్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో సూర్య రెండు విభిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు.

ఫస్ట్ డే డైరెక్టర్ నాకు అలా చెప్పారు! అది నేనెప్పటికీ మర్చిపోలేను : 'కంగువా' ప్రమోషన్స్​లో దిశా పటానీ

రాజమౌళి ఇన్​స్పిరేషన్​తో 'కంగువా' మూవీ! - అందుకే రెండేళ్లు పట్టింది : హీరో సూర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.