How to Make Ribbon Pakoda Recipe : చాలా మందికి ఈవెనింగ్ టీ టైమ్‌లో ఏదోక స్నాక్ తినాలనిపిస్తుంటుంది. అలా అని ఎప్పుడూ పకోడా, సమోసా, మిర్చీ బజ్జీ తినలేరు. దీంతో కొత్తగా ఏమైనా తినాలనిపిస్తుంది. ఇలా కొత్తగా ఏమైనా తినాలనుకునే వారు ఈ రిబ్బన్ పకోడాను ట్రై చేయవచ్చు. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడా చేసుకుంటే సాయంత్రం టీ టైమ్‌కు బెస్ట్ స్నాక్ అని చెప్పవచ్చు. పెద్దగా కష్టపడకుండానే ఈ విధంగా చేస్తే అచ్చం స్వీట్‌షాప్ స్టైల్ మాదిరి ఇంట్లోనే తయారైపోతుంది. ఇది పిల్లలకు స్నాక్ బాక్స్‌లో పెట్టేందుకు కూడా బాగుంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్‌గా క్రంచీ రిబ్బన్ పకోడా చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానం ఏంటో ఓ సారి చూడండి..
రిబ్బన్ పకోడాకి కావాల్సిన పదార్థాలు :
- శనగ పిండి - అర కప్పు
- బియ్యం పిండి - అర కప్పు
- పుట్నాల పప్పు-అరకప్పు
- ఇంగువ - చిటికెడు
- జీలకర్ర-టీస్పూన్
- కారం -టీస్పూన్
- నువ్వులు - 1 టేబుల్ స్పూన్
- బటర్ - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు రుచికి సరిపడా
- నీరు సరిపడా
- నూనె - డీప్ ఫ్రై కోసం
తయారీ విధానం :
- ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి పుట్నాల పప్పు తీసుకోండి. ఇందులో జీలకర్ర, కారం వేసి మెత్తగా పొడి చేసుకోండి.
- తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి బియ్యం పిండి, శనగపిండి, గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పొడి వేసి కలపండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నువ్వులు, ఇంగువ వేసి మిక్స్ చేయండి.
- తర్వాత స్టౌపై చిన్న పాన్ పెట్టండి. గిన్నెలో బటర్ వేసి కరిగించండి. కరిగిన బటర్ని పిండిలో వేసి బాగా కలపండి. (ఇక్కడ మీరు బటర్‌కి బదులుగా వేడి నూనె లేదా నెయ్యి వాడుకోవచ్చు)
- ఇప్పుడు పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ పిండిని గట్టిగా రెడీ చేసుకోండి. (రిబ్బన్ పకోడా క్రిస్పీగా రావాలంటే పిండి కాస్త గట్టిగానే ఉండాలి.)
- ఇప్పుడు రిబ్బన్ పకోడా వేయించడం కోసం స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో సరిపడా ఆయిల్ వేసి వేడి చేయండి.
- తర్వాత రిబ్బన్ పకోడా వచ్చేలా ఉన్న అచ్చు.. మురుకుల గొట్టంలో పెట్టండి. దీనికి నూనె రాసి పిండి ముద్ద పెట్టండి.
- ఇప్పుడు వేడి నూనెలో రిబ్బన్ పకోడా వేసి ఫ్రై చేసుకోండి.
- రిబ్బన్ పకోడా రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇవి చల్లారిన తర్వాత తింటే కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.
- టీ టైమ్‌కి బెస్ట్ స్నాక్స్‌గా ఇవి చాలా బాగుంటాయి. పైగా తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.
కరకరలాడే "ఎగ్ కట్లెట్స్" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్ అంతే!