పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌లో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ముత్తారంలోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిని... అదే కాలేజీలో చదువుతున్న ఒక అబ్బాయి కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఫోటోలు చూపించి బెదిరించటం వల్ల ఆ అమ్మాయి తనలో తానే కుమిలిపోయింది.
అమ్మాయి బాధను గ్రహించిన మేనమామ... అబ్బాయి తల్లిదండ్రులను కలిసి విషయం తెలిపాడు. అయినా మారకపోగా... మరింతగా వేధించసాగాడు. భరించలేకపోయిన బాలిక... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విగతజీవిగా వేలాడుతోన్న బాలికను చూసిన ఇరుగుపొరుగు వారు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.
విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేధింపులకు గురిచేసిన అబ్బాయిని కఠినంగా శిక్షించి... తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు వేడుకుంటున్నారు.