ETV Bharat / state

'కొత్త చట్టాల కారణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేం' - రైతు వేదికను ప్రారంభించిన మంత్రి నిరంజన్​రెడ్డి

నూతన వ్యవసాయ చట్టాల కారణంగా రైతులు తమ పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితి ఏర్పడిందని మంత్రి నిరంజన్​ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

minister niranjan reddy, garrepally village, raithu vedika
మంత్రి నిరంజన్​రెడ్డి, గర్రెపల్లి గ్రామం, రైతు వేదిక
author img

By

Published : Jan 18, 2021, 5:05 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల కారణంగా రైతులు తాము పండించిన పంటలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితి నెలకొందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పెద్దపెల్లి జిల్లాలోని గర్రెపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

2014లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసం ప్రతి ఏడాది రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అందుకే రైతుల శ్రేయస్సు కోసం రైతు వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత చేస్తుంటే కేంద్రం మాత్రం వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చి వారిని అయోమయానికి గురిచేసిందని మండిపడ్డారు.

రైతు పండించిన పంటకు ఎంఎస్పీ ధర కేంద్రమే నిర్ణయిస్తుంది. కొత్త చట్టాలతో ఇప్పుడు ధరని కేంద్రం నిర్ణయించదు. ఈ ప్రభావం భవిష్యత్తులో రైతులపై ఏ విధంగా ఉంటుందో చూడాలి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలన్నింటినీ రైతులు ఎప్పటికప్పుడు అవగతం చేసుకోవాలి.

నిరంజన్​ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

నూతన వ్యవసాయ చట్టాల కారణంగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని మంత్రి చెప్పారు. వర్షాకాలంలో రైతులు పండించిన కందులను మాత్రం కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.