ETV Bharat / state

ఎరువుల కర్మాగారాన్ని పరిశీలించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

author img

By

Published : Jun 14, 2020, 7:51 PM IST

సెప్టెంబర్​ నెల ప్రారంభం నాటికే ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారం పనులను ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. ఎరువుల కర్మాగార నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని స్పష్టం చేశారు.

Minister Niranjan Reddy Visits Ramagundam Fertilizers Factory
ఎరువుల కర్మాగారం పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తిచేసి సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. కర్మాగారాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఎరువుల కర్మాగారం నిర్మాణ పనులను సంస్థ ప్రతినిధులు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు.

99 శాతం పనులు పుర్తయ్యాయి..

1985లో మూసివేసిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాలని, ఎన్టీపీసీలో అదనపు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ పోరాటం చేశారని మంత్రి గుర్తు చేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేంద్రంలో తన వంతు కృషి చేసి ఫలితం సాధించారని మంత్రి తెలిపారు. రూ.6120.5 కోట్ల నిర్మాణంతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99% పూర్తయ్యాయన్నారు. ఎరువుల కర్మాగారానికి అవసరమైన నీటి సరఫరా ,విద్యుత్ సరఫరా, గ్యాస్ సరఫరా పనులు పూర్తి చేశామన్నారు.‌ ప్రతి రోజు 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం 12.5 లక్షల యూరియా ఉత్పత్తి అవుతుందని మంత్రి వివరించారు.

జూలై చివరి వరకు నిర్మాణం పూర్తి..

కరోనా నేపథ్యంలో ప్లాంట్ కమిషన్ పనులు 3నెలల పాటు ఆలస్యమవుతున్నాయని, విదేశాల నుంచి నిపుణుల సహకారం సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. జూలై చివరి వరకు అమ్మోనియా ప్లాంటు నిర్మాణ పనులు, ఆగస్టు చివరి నాటికి యూరియా ప్లాంట్​ నిర్మాణ పనులు పూర్తిచేసి సెప్టెంబర్లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు. సెప్టెంబర్​లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభించి అక్టోబర్ నాటికి స్టెబిలైజేషన్ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి సంవత్సరం 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, అందులో 6.25 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు కేటాయిస్తున్నామన్నారు. ఎరువుల కర్మాగారం నిర్మాణం పూర్తైతే వ్యవసాయ రంగానికి ఎరువుల కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు.

ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.