ETV Bharat / state

గొల్ల, కుర్మల అభివృద్దికి కృషి చేస్తున్నాం: మంత్రి కొప్పుల - పెద్దపల్లి జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్

రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు ప్రోత్సాహం ఇస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గొల్ల, కుర్మల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కుందనపల్లిలో గొర్రెల మార్కెట్ యార్డును రామగండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​తో కలిసి ఆయన ప్రారంభించారు.

minister koppula eswar inaugurated market yard
గొల్ల, కుర్మల అభివృద్దికి కృషి చేస్తున్నాం: మంత్రి కొప్పుల
author img

By

Published : Oct 20, 2020, 5:35 PM IST

గొల్ల, కుర్మల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కుల వృత్తులకు ప్రభుత్వం పోత్సాహం ఇస్తోందని పేర్కొన్నారు. ఉచితంగా గొర్రెలు అందించి వారికి భరోసా కల్పిస్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా ఆంతార్గాం మండలం కుందనపల్లి వద్ద గొర్రెల మార్కెట్ యార్డ్​ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్​తో కలిసి ఆయన ప్రారంభించారు.

సులభ విక్రయాలు

రాష్ట్రంలోనే మెదటి సారిగా రామగుండం నియోజకవర్గంలో గొర్రెల మార్కెట్ యార్డు ప్రారంభించారని మంత్రి తెలిపారు. సులభంగా విక్రయించడం ద్వారా కొనుగోలు దారులకు లాభం కలుగుతుందన్నారు. 25 లక్షలతో మార్కెట్ నిర్మించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాల్వ అనసూర్య-రాంరెడ్డి, జడ్పీటీసీ ఆముల నారాయణ, మట్ట లక్ష్మి- మహేందర్ రెడ్డి, ఎర్రం స్వామి, రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, సర్పంచ్​లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ప్రతిఒక్కరూ కాచి వడపోసిన నీటినే తాగాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.