దివ్యాంగులు తమకు తామే ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు మోటార్ సైకిళ్లు, అధునాతన చేతి కర్రలను అందజేశారు. వారి ఆర్థిక ఎదుగుదలకు రాయితీపై రుణాలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెరాస ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులను ఆదుకునేందుకు రెండు వేల రూపాయల పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఒకరిపై ఆధారపడకుండా ఆత్మస్థైర్యంతో జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.