రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో... నిందితుల బెయిల్ పిటిషన్‌ను మంథని కోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం ముగ్గురు నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది.
బిట్టు శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్‌కు బెయిల్ ఇవ్వడం కురదరని చెప్పింది. వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. డీసీపీ అశోక్ కుమార్ మంథని కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు.