ETV Bharat / state

కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది: ఎమ్మెల్యే - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన పోరాడుతుందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ధరణి పోర్టల్​ను అట్టహాసంగా ప్రారంభించారని, కానీ దానివల్ల అన్నదాతలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు.

Manthani MLA Sridhar Babu protest
కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది: ఎమ్మెల్యే
author img

By

Published : Jan 7, 2021, 10:28 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన పోరాడుతుందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి, రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మంథని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ప్రభుత్వ నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుంటు పరిచే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఐకేపీ కేంద్రాలను ఎత్తివేయాలనే రాష్ట్రప్రభుత్వం నిర్ణయంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. 2006 లో రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం కోసం గ్రామాలలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. రైతు సంఘాలు చేపట్టిన భారత్ ​బంద్​కు అన్ని పార్టీలతో కలిసి తెరాస కూడా సంఘీభావం తెలిపిందని... మరునాడే రైతు వ్యతిరేక విధానాలను తీసుకొచ్చిందని విమర్శించారు.

రాష్ట్రప్రభుత్వం ధరణి పోర్టల్​ను అట్టహాసంగా ప్రారంభించిందని... దానివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. 4 నెలలుగా కష్టపడుతున్న రైతులకు తెరాస నాయకులు, ప్రభుత్వం ఎలాంటి జవాబు చెబుతారని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయకుంటే రైతులతో కలిసి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఐటీఐఆర్​ ప్రాజెక్టుపై కేంద్రం వైఖరేంటి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.