ETV Bharat / state

లారీ డ్రైవర్​పై తెరాస కార్యకర్తల దాడి.. శ్రీధర్​ బాబు ఆగ్రహం - పెద్దపల్లి జిల్లా వార్తలు

మంథనిలో ఓ లారీ డ్రైవర్​పై ఆదివారం నాడు తెరాస కార్యకర్తలు దాడి చేశారు. బాధితుడు గాయాలతో ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అధికార పార్టీ కార్యకర్తలు ప్రత్యక్షంగా దాడులకు దిగుతున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లారీ డ్రైవర్​పై తెరాస కార్యకర్తల దాడి.. శ్రీధర్​ బాబు ఆగ్రహం..
లారీ డ్రైవర్​పై తెరాస కార్యకర్తల దాడి.. శ్రీధర్​ బాబు ఆగ్రహం..
author img

By

Published : Jan 27, 2020, 12:55 PM IST

లారీ డ్రైవర్​పై తెరాస కార్యకర్తల దాడి.. శ్రీధర్​ బాబు ఆగ్రహం..
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎరుకల గూడెంకు చెందిన గంగాధరి సత్యనారాయణ అనే లారీ డ్రైవర్​పై ఆదివారం తెరాస కార్యకర్తలు దాడి చేశారు. తన కళ్లల్లో కారం చల్లి దాడికి దిగినట్లు బాధితుడు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు వద్దకు గాయాలతో వెళ్లాడు. వెంటనే సత్యనారాయణను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి.. పోలీసులతో మాట్లాడారు. ఈ విషయంపై కాంగ్రెస్​ నాయకులు కొంతసేపు ధర్నా నిర్వహించారు.

సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్​ అన్నారని.. అయితే మంథని నియోజకవర్గంలో అధికార పార్టీ వారు మాత్రమే ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని శ్రీధర్​ బాబు ఆరోపించారు. ప్రత్యక్షంగా దాడులకు దిగుతున్నారని, అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంథని మున్సిపాలిటీలో రౌడీయిజం నడుస్తోందని, తమని చంపుతారా అని బాధితుడి భార్య నిలదీశారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. పోలీసులు తెరాస కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు.

ఇవీ చూడండి: అయిజ పీఠం తెరాసకే! ఏఐఎఫ్​బీ మద్దతు

Intro:మంథని లో పోలీసు వ్యవస్థ ఉన్నదా అని మంథని సీఐ ని ప్రశ్నించిన శ్రీధర్ బాబు.

పెద్దపల్లి జిల్లా మంథని లో పురపాలక సంఘం ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు.

నిన్నటి రోజు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలపై టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేశారని ఐలి .ప్రసాద్ అనే బాధితుడు శనివారం రాత్రి మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటన మరువక ముందే ఈరోజు ఆదివారం మధ్యాహ్నం మంథని పట్టణంలోని ఎరుకల గూడెం కు చెందిన గంగాధరి సత్యనారాయణ అనే లారీ డ్రైవర్ పై టిఆర్ఎస్ కార్యకర్తలు కళ్లల్లో కారం చల్లి అతనిపై దాడి చేశారని, ఆ బాధితుడు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వద్దకు గాయాలతో వచ్చాడు. వెంటనే ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పోలీసులతో మాట్లాడి గాయాలకు గురైన సత్యనారాయణ మంథని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు.

మంథని ప్రభుత్వ వైద్యశాల ముందు కాంగ్రెస్ నాయకులు కొంత సేపు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు, బాధితుడి భార్య మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీలో రౌడీయిజం నడుస్తుందని, మమ్మల్ని చంపుతార అని, ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఫ్రెండ్లీ పోలీస్ లేదని, పోలీసులు మొత్తం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు.

నిన్న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగ్లు పెడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.కానీ మంథని నియోజకవర్గంలో ఆ పార్టీ వారు మాత్రమే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ,ప్రత్యక్షంగా దాడులకు దిగుతున్నారని, అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

మంథనిలో పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతూ, నిన్నటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న పట్టించుకోకుండా, అసలు మంధని లో పోలీస్ వ్యవస్థ ఉన్నదా అనే నమ్మకం ప్రజల్లో లేకుండా పోయిందని,
మంత్రి సీఐతో వాగ్వాదానికి చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీధర్ బాబు.

బైట్. దుద్దిల్ల. శ్రీధర్ బాబు మంధని శాసనసభ్యులు

రమాదేవి. బాధితుని భార్య.

Body:యం.శివప్రసాద్, మంధని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.